లేడీ సూపర్ స్టార్ నయనతార,- విఘ్నేష్ శివన్ .. గతేడాది అక్టోబర్ లో సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటివరకు పిల్లల ముఖాలను బయటికి చూపెట్టలేదు. కనీసం చిన్నారుల పూర్తి పేర్లను వెల్లడించలేదు. కేవలం తమ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగం అని మాత్రమే విఘ్నేష్ చెప్పారు. పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారు కానీ.. ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ నేపథ్యంలో నయనతార తమ పిల్లల పూర్తి పేర్లను వెల్లడించారు. ఒక కొడుకు పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్’ అని, రెండో కొడుకు పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్’ అని తెలిపారు. ఇటీవల నయనతార ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ ఆమెను పిల్లల పూర్తి పేర్లను చెప్పమని అడగడంతో బయటపెట్టారు. విఘ్నేష్ శివన్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పిల్లల పేర్లను వెల్లడించారు.
కాగా గతేడాది జూన్ 9న డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమ వివాహం చేసుకున్న సంగతిత తెలిసిందే. ఈ వివాహానికి దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో సూర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు.
అయితే పెళ్లయిన నాలుగు నెలలకే.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. వారి కాళ్లను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వారి పేర్లను ఉయిర్, ఉలగం అంటూ విఘ్నేష్ తెలియజేశారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు