లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం‘పెద్దన్న’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ పుట్టినరోజు వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న నయన్ త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.
నాలుగు పడక గదులతో ఉన్న ఈ ఇంటి కోసం నయన్ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని.. త్వరలోనే విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా నయన్-విఘ్నేశ్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని వినికిడి. వివాహం తర్వాత ఈ జంట నివసించడం కోసమే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు అనుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్ తెలుగులో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’, తమిళంలో ‘కాతువక్కుల రెందు కాదల్’, ‘కనెక్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు.