పలువురు స్టార్ హీరోయిన్లు సినిమాలు పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ.. రెండు చేతుల సంపాందిస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, శృతీహాసన్, రాశీ ఖన్నాల జాబితాలో ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. వీరి జాబితాలో నయనతార కూడా చేరారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించనున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేసేందుకు నయనతార పచ్చ జెండా ఊపినట్లు తెలిస్తుంది. ఆమెకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్.
రెండు సీజన్స్‌గా రాబోతున్న ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబరులో ఆరంభం కానుంది. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఈ పాత్ర పూర్వాపరాల మీద వెబ్ సిరీస్ ఉంటుందని టాక్. 2015లో వచ్చిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన పంజాబీ నటి వామికా గబ్చి ఈ శివగామి పాత్ర చేయనున్నారని సమాచారం. అదే నిజమైతే నయనతార పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక నయనతార నటించిన తాజా చిత్రాలు ‘అన్నాత్తే’, ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’, ‘నెట్రిక్కన్’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.