లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ అభిమానిపై ఫైర్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ అభిమాని వీడియో తీస్తుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు. అసలు విషయం ఏమిటంటే.. హనుమాన్ జయంతి సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి గురువారం తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించింది.
ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి రావడంతో స్పందించిన విఘ్నేశ్ శివన్ వారికి అభివాదం చేసి తమను ప్రశాంతంగా పూజలు చేసుకోనివ్వాలని కోరాడు. అయినప్పటికీ వారు వినకపోవడంతో తోపులాట జరిగింది.
దీంతో నయన్ పూజ అనంతరం బయటకు వచ్చేసి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. అనంతరం అక్కడి నుంచి రైలులో తిరిగి బయలుదేరారు. అయితే, నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించింది. పూజ సమయంలో కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఐదునిమిషాలు కూడా ఆగలేరా అంటూ మండిపడింది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు