HomeTelugu Trendingనా నిశ్చితార్థం అయిపోయింది: నయనతార

నా నిశ్చితార్థం అయిపోయింది: నయనతార

Nayanthara confirmed her en

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నిశ్చితార్థం అయిపోయింది. ఎంతో కాలంగా తను ప్రేమిస్తున్న తమిళ డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్ తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నయన్ ప్రకటించింది. సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ దూరంగా ఉండే నయన్.. ఇప్పుడు తన తాజా చిత్రం ‘నెత్రికన్’ కోసం ప్రమోషన్ల బాట పట్టింది. అందులో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి, నిశ్చితార్థం గురించి స్పష్టతనిచ్చింది. నిశ్చితార్థమైపోయిందని చెప్పిన నయన్.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. విఘ్నేశ్ చాలా మంచివాడని చెప్పింది. అతడు తనతో ఉంటే ఎప్పుడూ ఆనందమేనంది.

కాగా ‘నెత్రికన్’ సినిమాలో నయన్ అంధురాలి పాత్రలో నటించింది. మిలింద్ రావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అజ్మల్ విలన్ గా నటించాడు. ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమాను విడుదల చేయనున్నారు. ఆగస్టు 13న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Recent Articles English

Gallery

Recent Articles Telugu