ప్రముఖ నటి నయనతార- విఘ్నష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ.. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ వార్తలు వార్తలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన వీరూ అతి త్వరలోనే తమిళనాడులోని ఓ గుడిలో వివాహం చేసుకోనున్నారని.. తక్కువ మంది బంధువులు మాత్రమే హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ శుభవార్తతో నయన్ అభిమానలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నయన్-విఘ్నేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్ కానీ, విఘ్నేశ్ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నయన్ హీరోయిన్‌గా 2015లో తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’ సినిమా సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది.