HomeTelugu Big Storiesవివాహా బంధంతో ఒక్కటైన నయన్‌- విఘ్నేష్‌ .. హజరైనా ప్రముఖులు

వివాహా బంధంతో ఒక్కటైన నయన్‌- విఘ్నేష్‌ .. హజరైనా ప్రముఖులు

Nayanthara and vignesh shiv
కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. ఈరోజు (గురువారం.. జూన్‌ 9) తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్‌-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. మహాబలిపూరంలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు సైతం హజరైనట్లు తెలుస్తోంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌లు పెళ్లికి హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

రజనీకాంత్‌ కారు దిగి లోపలికి వెళుతున్న ఫొటోను ఒకటి బయటక రాగా.. పెళ్లిలో క్రిమ్‌ కలర్‌ షూట్‌, వైట్‌ షర్డ్‌ ధరించి షారుక్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్దాని షేర్‌ చేసింది. షారుక్‌తో పాటు డైరెక్టర్‌ అట్లీ కూడా హజరయ్యాడు. అంతేకాదు కోలీవుడ్‌ చెందిన స్టార్‌ హీరోలు అజిత్‌, కార్తీ, విజయ్‌తో పాటు టాలీవుడ్‌, శాండల్‌వుడ్‌కి చెందిన సినీ సెలబ్రెటీలు సైతం పెళ్లికి హజరైనట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu