స్టార్ హీరోయిన్ నయనతార-లారెన్స్ రాఘవా కలిసి ఓ హారర్ మూవీ నటించనున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లారెన్స్ ‘చంద్రముఖి’ చేసిన సంగతి తెలసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో లారెన్స్ తన తదుపరి రత్నకుమార్ డైరెక్షన్లో ఒక హారర్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రితం ఏడాది నుంచి ఈ కాంబినేషన్ మాట వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ కథ .. స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకి సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. హారర్ సినిమాలు చేయడంలో మంచి అనుభవం ఉన్న లారెన్స్ – నయనతార ఇద్దరూ కూడా ఏ రేంజ్ లో మెప్పిస్తారనేది చూడాలి మరి.