నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్. ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్న ఈ అందాల తార మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ సినిమా టైటిల్ ‘వాసుకి’. ‘పుదియ నియమం’ అనే మలయాళ చిత్రానికి అనువాదమిది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
చిత్రనిర్మాత ఎస్.ఆర్. మోహన్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా నయన్ కెరీర్ లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్రతి మహిళా ఈ చిత్రంలో నయనతార పాత్రకు కనెక్ట్ అవుతారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి.. ప్రస్తుతం తెలుగులో అనువాదం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్‌లను ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నాం. అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమాని రిలీజ్ చేస్తాం. గోపిసుందర్ సంగీతం సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది” అన్నారు.