తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్- బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘జవాన్’. షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, నయనతార ఒక కీలకమైన పాత్రను పోషించింది.
ఈ సినిమా నుంచి తాజాగా నయన్ లుక్‌ని విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో నయన్ ఇలా యాక్షన్ లుక్ తో కనిపించిన సినిమా ఇదే. ఈ సినిమాలో నయన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొందనే విషయం అర్థమైపోతూనే ఉంది. 20 ఏళ్ల కెరియర్లో నయన్ నేరుగా చేసిన బాలీవుడ్ సినిమా ఇది.
ఇక అట్లీ కుమార్ చాలాకాలం పాటు వెయిట్ చేసి మరీ, షారుక్ ను ఒప్పించాడు. ‘రాజా రాణి’ నుంచి అట్లీ కుమార్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే నయన్ ఈ సినిమా ఒప్పుకుందని అంటారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.