కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పిల్లలను ఎత్తుకుని మాస్ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదొ అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇన్నాళ్లు తన సినిమా అప్‌డేట్స్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పంచుకున్న నయన్.. ఇప్పుడు అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి వచ్చింది.
నయన్ ఇన్‌స్టాలో ఐదుగురిని ఫాలో అవుతుంది. అందులో భర్త విఘ్నేష్, షారుఖ్ ఖాన్, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్ సంస్థ ది రౌడీ పిక్చర్స్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాను ఫాలో అవుతుంది. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో నయనతార దిట్ట. ఫ్లాప్ హిట్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాతో నయన్ దూసుకుపోతుంది. ప్రస్తుతం నయన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘జవాన్’ ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.instagram.com/reel/CwmOAfkvu2M/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==