నందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. కథను ఇప్పటికే లాక్ చేశారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో షూటింగ్ కు వెళ్తున్నారట. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు చేయబోతున్న సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
బోయపాటి.. బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమాలో నయనతారనే హీరోయిన్. బాలకృష్ణతో నయనతారకు నాలుగో సినిమా ఇది. అంతకు ముందు సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా వంటి సినిమాలు చేసింది. కోలీవుడ్ లో ఈ సీనియర్ హీరోయిన్ టాప్ స్టార్ గా ఉంది. సోలో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ.. మరోవైపు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నది నయనతార.