మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో సినిమా సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్ళాలి. కానీ, అక్టోబర్ లో కాకుండా ఈ మూవీ జులైలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. సైరా పూర్తయ్యాక మెగాస్టార్ రెండు నెలలు గ్యాప్ తీసుకుంటారని అనుకున్నారు. కానీ, 15 రోజులు మాత్రమే గ్యాప్ తీసుకొని చిరంజీవి సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఇందులో అనసూయ కూడా ఓ లీడ్ రోల్ చేస్తుండటం విశేషం. రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా ఈ సినిమాను నిర్మిస్తోంది.