హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల ఫస్ట్ బర్త్ డే సందర్భంగా వారి ముఖాలు ఎలా ఉన్నాయో అభిమానులకు చూపించారు. తమ ఇద్దరు పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈఫోటోలే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తమ పిల్లల ఊసులు, మాటల గురించి సోషల్ మీడియాలో రోజూ షేర్ చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ని అందరితో షేర్ చేసుకోవడంలో వెనుకాడరు. కానీ ఇప్పటి వరకూ తమ కవల పిల్లల ముఖాలు చూపించలేదు.
“ఎన్ ముకక్ కొండ ఎన్ ఉయిర్… ఎన్ గుణం కొండ ఎన్ ఉలక్… ఈ లిరిక్స్ అని కామెంట్ పెట్టి పోస్టు చేశారు. మా కవల పిల్లల ఫోటోను పోస్ట్ చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. నాన్న, అమ్మ మిమ్మల్ని మాటల్లో చెప్పలేనంతగాప్రేమిస్తున్నారని నయనతార, విఘ్నేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.
నయన్, విఘ్నేష్ కవల పిల్లలకు అందరూ కంగ్రాట్స్, విషెస్ చెబుతున్నారు. మా జీవితంలోకి వచ్చి ఇంత సంతోషం కలిగించినందుకు ధన్యవాదాలు మరియు మీరు మా జీవితంలో అన్ని సానుకూలతలను మరియు ఆశీర్వాదాలను తీసుకువచ్చారని కామెంట్ ద్వారా తమ ఫీలింగ్‌ని షేర్ చేసుకుంటున్నారు.
నయనతార, విఘ్నేష్ దంపతుల కవల పిల్లలు ఉయిరి, ఉలక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు తారలతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పిల్లల ఫస్ట్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందు వాళ్లిద్దరూ చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోని విఘ్నేష్ శివన్ తెల్లవారుజామున పోస్ట్ చేశాడు. ఈఫోటోలు, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.