స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. స్కిన్‌కేర్ ప్రోడక్ట్స్ వ్యాపారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నయనతార భర్త విఘ్నేశ్ ట్వీట్ చేశారు.
ఆరేళ్ల కృషి, ప్రేమను అందరితో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 నుంచి తమ ప్రయాణం మొదలు కాబోతున్నట్లు.. స్కిన్ కేర్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను తమ అధికారిక సైట్ 9SKINOfficial ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా నయనతార నటించిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో నయనతార అభినయానికి చక్కటి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను నయన్ ఎంజాయ్ చేస్తోంది.
https://x.com/NayantharaU/status/1702200256157622421?s=20