గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా రోజుకో వార్తతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సమంత, చైతుల ప్రేమ. వారిద్దరు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు మీడియాలో పేర్లు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. నాగార్జున కూడా చైతు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తన నిర్ణయం పట్ల మేము సంతోశంగా ఉన్నామని చెప్పడంతో తన పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇటీవలే మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు చైతు, సమంతతో ప్రేమలో ఉన్నాడని చెప్పేశాడు. నాగార్జున ఎలాగో రివీల్ చేసేశారు కదా అని చైతు కూడా ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంతను ప్రేమిస్తున్నట్లుగా చెప్పారు. కానీ పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తన వంతు వచ్చింది అన్నట్లుగా సమంత.. ధైర్యంగా ఓ ఇంటర్వ్యూలో ‘అవును.. నేను చైతో డేటింగ్ లో ఉన్నా’ అని చెప్పేసింది. అంతేకాదు పెళ్ళైన తరువాత నటనకు దూరమవుతారా అని అడిగిన ప్రశ్నకు.. పెళ్లి అయిన తరువాత సినిమాలను ఎందుకు వదులుకోవాలి.. నా నటనను ప్రోత్సహించే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను. అటువంటి ఫ్యామిలిలోకి కోడలిగా వెళ్తున్నాను. దర్శకనిర్మాతలు వద్దు అనేవరకు నేను నటిస్తూనే ఉంటా.. అలానే చైతు గురించి చెబుతూ.. సింపుల్ గా చెప్పాలంటే నావకు లంగరు ఎలాగో నా జీవితానికి చై అలా.. అని తన మీద ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేసింది.
Attachments area