టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం నేచర్‌ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ హీరో వెకేషన్ లోను తన ఫిట్ నెస్ ని వదలలేదు.. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఇదుగో ఇలా వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. రోజు తన వెకేషన్ ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్న ఈ హీరో తాజాగా ఒక వీడియోను షేర్ చేసాడు. కొండపైకి ఎక్కి.. షర్ట్ లేకుండా పుషప్స్ (బస్కీలు) తీస్తూ కనిపించాడు. అంత ఎత్తైన ప్రదేశంలో చొక్కా కూడా లేకుండా నవదీప్ సాహసం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది
ఈ వీడియోకు నెటిజన్స్ తమదైన స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు.. దేనికోసం అన్నా ఇంత కష్టపడుతున్నావు అని కొందరు.. వావ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అని మరికొందరు.. జిమ్ సరిపోక రాళ్లు కూడా వాడేస్తున్నావా బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నవదీప్ ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడు.. ఈ లుక్ ఏదైనా సినిమా కోసమా ..? లేక వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాలంటే.. నవదీప్ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.
#baskibaalraj pic.twitter.com/k1ysdMa8B4
— Navdeep (@pnavdeep26) December 4, 2021