HomeOTTNavadeep: 20 రోజుల్లో ఓటిటి కి వచ్చిన మరొక సినిమా

Navadeep: 20 రోజుల్లో ఓటిటి కి వచ్చిన మరొక సినిమా

Love Mouli
Navadeep Love Mouli streaming on OTT Platforms

Navadeep Love Mouli OTT: ఈ మధ్యకాలంలో సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో కూడా ప్రత్యక్షమవుతోంది. సినిమా ఫ్లాప్ అయితే 20 రోజుల్లోనే ఆ చిత్రం ఓటీటీలో ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవడం మొదలుపెడుతోంది. గత కొంతకాలంగా చిన్న సినిమాలు పరిస్థితి ఇలాగే ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆహా నా పెళ్ళంట, గం గం గణేశా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ వంటి సినిమాలు 20 రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమ్ అవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నవదీప్ నటించిన ఒక సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

అదే లవ్ మౌళి. విడుదలకి ముందు నుంచే బోల్డ్ కంటెంట్, నవదీప్ కొత్త లుక్, ముద్దు సన్నివేశాలు సినిమాని బోలెడన్ని వివాదాల్లోకి నెట్టాయి. అయితే అన్నిటినీ దాటుకుంటూ ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదలైంది.

ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే మెప్పించిన ఈ చిత్రం కమర్షియల్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ కలెక్షన్లు అందుకుంది. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలలో ప్రత్యక్షమైంది.

నవదీప్ లవ్ మౌళి సినిమా ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లలో ఈ సినిమాని చూడటం మిస్ అయిన అభిమానులు, లేదా థియేటర్ల దాకా వెళ్లకుండా ఓటీటీలలోనే సినిమా చూద్దామని ఫిక్స్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీగా ఆహలో ఈ సినిమాని చూసేయొచ్చు.

Navadeep Love Mouli:

ఈ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడి ఒక కొత్త లుక్ లో కనిపించారు. పంకూరి గిధ్వని ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మించారు. చార్వి దత్త, భావన సాగి కూడా ఈ సినిమాలో హీరోయిన్లు గా కనిపించారు. ఒక అఘోరా పాత్రలో రానా దగ్గుబాటి సినిమాలో స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. గోవింద్ వశిష్ట ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu