నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమా ప్రేక్షకుల ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక సన్నివేశం కోసం నాని మందు కొట్టి నటించాడనే ప్రచారం జరుగుతుంది. మూవీ యూనిట్ ఆ విషయాన్ని బయటకు లీక్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నానినే ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలను మందు కొట్టి నటించారంటా కదా.. అని ప్రశ్నించిన సమయంలో అవును అనే సమాధానం ఇచ్చాడు నాని.
నాని మాట్లాడుతూ.. స్క్రిప్ట్ చెప్పినప్పుడే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నాకు కొన్ని సన్నివేశాలను తాగి నటించాలని చెప్పాడు. నీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. నాకేం అభ్యంతరం లేదన్నాను. డైరెక్టర్ చెప్పిన స్క్రీన్ ప్లే మరియు కథకు మందు కొట్టి నటించడం అవసరంగా అనిపించింది. అందుకే నటించాను అన్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని పాత్ర అత్యంత విభిన్నంగా ఉంటుందని పోస్టర్స్ మరియు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే సినిమా అవుతుందని.. కేజీఎఫ్.. ఆర్ ఆర్ ఆర్.. కాంతార రేంజ్ లో దసరా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నారని నాని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు