నాచురల్ స్టార్ ‘నాని’ పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఇది నాని 27వ చిత్రం.ఈ చిత్రానికి వెరైటీగా ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు.
కాగా ‘నాని’ కి ఇది 27 వ చిత్రం. అయితే ఈ చిత్రం ప్రారంభం,చిత్రానికి సంబంధించిన ఇతర సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రాని పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్నారు. నాని హీరోగా మార్చి 25న ఉగాది కానుకగా ‘వి’ సినిమా విడుదల కానుంది. ని నిర్మాత గా విశ్వక్ సేన్ హీరో గా చేసిన ‘హిట్’ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. అటు హీరోగా ఇటు నిర్మాతగా నాని సినిమాలు చేస్తున్నారు.