AP Elections 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేడి మాత్రం ఇంకా చల్లరలేదు. వైసీపీ మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్నికలు ముగిశాయని.. గెలుపు, ఓటములనేది అంచనాలే అని అన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వాడిగా చెబుతున్నా.. కూటమి ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీతో గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు.
జన్మభూమి మీద అభిమానంతో 70 లక్షల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతకుముందెప్పుడు ఇలా జరిగింది లేదని అన్నారు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి ఈ అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన వారిందరికీ శాశ్వతంగా విశ్వంతి వస్తుందని అన్నారు. రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని.. అవన్ని తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు..ఈ ఎన్నికల్లో అభివృద్ధి కావాలని ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి మెగా కుటుంబం, ప్రజల నుంచి 99 శాతం సపోర్ట్ ఉంది. ఎవరో ఒక కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేయకపోనంత మాత్రానా ఏమి నష్టం లేదు. అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. మెగాస్టార్ ఓ మహా వృక్షం.. ఆయన వల్లే మెగా హీరోలు ఎదిగారు. ఎవరిష్టం వారిది.. అల్లు అర్జున్ కూడా అలానే సపోర్ట్ చేసుకున్నారు. సినిమాను సినిమాలానే చూడండి. కాబట్టి బన్నీని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు.
బన్నీ వెళ్లటం నాకు నచ్చకపోవటమనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. బన్నీ కూడా ఆలోచించాలి.. మీ ఫొటోను వారి పార్టీకి అనుగుణంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారు. ప్రభుత్వ సుపరిపాలనలో మమేకం అవుతారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుంది , యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది’ అని నట్టికుమార్ పేర్కొన్నారు.
కాగా వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ ప్రచారం చేశారు. శిల్ప రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడానికి నేడు నంద్యాల వెళ్లారు. నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్ప రవి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు. దీంతో బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్దఎత్తున ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.