66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ నటిగా ‘మహానటి’ సినిమాలో నటించిన కీర్తి సురేష్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్(ఉరి), ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్) ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తదితరులు హాజరయ్యారు.
జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్న విజేతలకు ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తేనీటి విందును ఇవ్వనున్నారు. ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బిగ్‌బిని వరించినప్పటికీ.. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ వేడుకలకు హాజరుకాలేకపోయారు. దీంతో తేనీటి విందు ఏర్పాటు చేసిన రోజే అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందచేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు.
Princess @KeerthyOfficial Receiving the prestigious National Award for Best Actress category in Telugu (Mahanati)#KeerthySuresh | @Jagadishbliss pic.twitter.com/fRHbrNbbc6
— Trends Keerthy ™ (@TrendsKeerthy) December 23, 2019