తమిళ నటుడు విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ తర్వాత చియాన్ పా రంజిత్ తో కలిసి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చియాన్ నటిస్తున్న 61వ చిత్రం టైటిల్ తంగలన్. ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. నిజానికి టైటిల్ వినగానే అభిమానులకు రకరకాల సందేహాలు. దానికి సమాధానంగా టీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.
ఈ సినిమాలో విక్రమ్ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టామని నిర్మాత తెలిపారు. నిర్మాత జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ పాత్రను తంగలన్ అని పిలుస్తారని, దానినే టైటిల్ పెట్టామని వెల్లడించారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ సహా ఇతర పాత్రలు రగ్డ్ లుక్‌తో కనిపిస్తాయి. కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
బ్రిటీష్ పాలనలో KGF లో పనిచేసిన వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇదని ఇంతకుముందు పా రంజిత్ వెల్లడించారు. దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి సంబంధించిన కథ, స్క్రిప్ట్‌పై దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వర్క్ చేసి ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ రగ్డ్ లుక్ కి ఇప్పటికే గొప్ప స్పందన వచ్చింది. అతడు గుబురు గడ్డం మాసిన జుత్తుతో ఒక సాధువులా కనిపిస్తున్నాడు.
2021లో సినిమా ప్రారంభం కాగా, అనంతరం పాత్రధారుల ప్రిపరేషన్ మొదలైంది. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు పా రంజిత్ ఎల్లప్పుడూ బలమైన ధైర్యమైన యువతులను తన సినిమాల్లో చూపిస్తారు. పీరియాడికల్ ఫిల్మ్ కథాంశంలో నాయికకు అద్భుతమైన పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉందని తెలిసింది. పా రంజిత్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు. అలాగే ఈ చిత్రాన్ని 3డిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా కోలీవుడ్ మీడియాలో గుసగుసల ప్రకారం.. ఇందులో చియాన్ విక్రమ్ నటనకు జాతీయ అవార్డ్ వస్తుందంటూ ఒక ప్రచారం సాగుతోంది. అతడి వేషధారణ, నటన శివపుత్రుడిని మించి అలరిస్తాయన్న అంచనాలు ఏర్పడ్డాయి.