HomeTelugu Trendingసిద్ధు 'నరుడి బ్రతుకు నటన'

సిద్ధు ‘నరుడి బ్రతుకు నటన’

Narudi Bratuku Natana Movieసితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ రోజు ‘నరుడి బ్రతుకు నటన’ అనే చిత్రాన్ని ప్రకటించింది. ఈమధ్య వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జంటగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తారు. ఈ చిత్రం ద్వారా విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఈ రోజు సంస్థ విడుదల చేసింది. తన్మయత్వంలో వున్న ఓ ప్రేమజంట చెవులకు హెడ్ ఫోన్స్ తో ఈ ప్రచార చిత్రాన్ని కొత్తగా డిజైన్ చేశారు. దీనిని బట్టి ఈ చిత్రంలోసంగీతానికి కూడా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా ఇది సితార ఎంటర్ టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న పదవ చిత్రం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu