‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్భుతమైన సోషల్ ఆర్గనైజేషన్. ఎంతో మంది అధ్యక్షులు సమక్షంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. ఇందులో ఒక మార్పు కావాలని కోరుకున్నప్పుడు నన్ను ప్రెసిడెంట్‌గా జీవిత గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు మేం ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండేళ్లు మంచి పనులు చేయాలని నిర్ణయించాం.
దీనిలో భాగంగా హెల్ప్ లైన్, పెన్షన్ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుంది. త్వరలో ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తాం. అయితే ‘మా’ అనేది ఒక కుటుంబం లాంటిది. ఏవైనా ఉంటే తమలో తాము మాట్లాడుకోవాలి. కాని.. మీడియా లీక్స్ అనేవి నాకు పర్సనల్‌గా బాధ కలిగిస్తోంది. ఎందుకంటే అందరం మంచి స్థాయిలో ఉన్నవాళ్లం. ఈ సందర్భంలో మీడియా లీక్స్ ఇవ్వడం మంచిది కాదు. ఇకపై మీడియాకి లీక్స్ ఇచ్చే వాళ్లపై యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం.
ఎందుకంటే మొన్న నాగబాబు గారిపై మిత్రుడు శివాజీరాజా చేసిన కామెంట్స్ బాధ కలిగించాయి. ఒకప్పుడు నాగబాబు ప్రెసిడెంట్.. తరువాత మురళీ మోహన్, శివాజీరాజా చేశారు. అయితే నాగబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆయనకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమే. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక నాగబాబు ‘మా’ కి ఏంచేశారు అంటూ శివాజీ రాజా కామెంట్స్ చేశారు. ఆయన ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు చాలా మందికి పెన్షన్‌తో పాటు సభ్యత్వాలు ఇప్పించారు. చేతనైన సాయం చేశారు ‘మా’లో చాలా మంచి పనులుచేశారు. కాబట్టి ఒక అధ్యక్షుడిగా పనిచేసి వ్యక్తిని ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తూ పబ్లిక్‌లో పెట్టొదనేది నా అభిప్రాయం.
Friends,Movie Artists Association (MAA) is a social organisation and me along with the new team were given opportunity for two years to serve better in a healthy atmosphereWe have taken new initiatives such as Helpline, Suggest Box, Reducing the membership fee and othersWe will continue work for the welfare of #MAA
Posted by Naresh on Thursday, May 2, 2019
అలాగే నాగబాబు పిల్లికి భిక్షం పెట్టలేదన్నారు. కాని ఆయన పోటీలో లేకపోయినప్పటికీ సొంతంగా రూ. 6 లక్షల రూపాయిలు డొనేట్ చేశారు. ఇవన్నీ రికార్డ్స్‌లో ఉన్నాయి. నాగబాబు మనస్పూర్తిగా మాకు సహకరించారు. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేద్దాం. ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించవద్దు. వివాదాల్లోకి ‘మా’ని లాగొద్దని నా సలహా. ఫైనల్‌గా శివాజీరాజా.. నాగబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా’ అన్నారు నరేష్. అనంతరం మాట్లాడిన జీవితా రాజశేఖర్.. నరేష్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ శివాజీరాజా వ్యాఖ్యల్ని ఖండించారు.