HomeTelugu Trending'నరకాసుర' ట్రైలర్‌

‘నరకాసుర’ ట్రైలర్‌

Narakasura trailer 1
‘పలాస’ ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి, సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. నౌఫల్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో అపర్ణ జనార్దన్ కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ … ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ‘నువ్వు నిర్మించుకు ఈ ప్రపంచంలో అంతా నీ వాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాథవే. కొన్ని సార్లు దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది’ అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. అడవికి సమీపంలోని ఒక విలేజ్ నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాని ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu