నేచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ సినిమా తరువాత ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీ కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో సెట్స్ లో నిర్వహిస్తారు. ఇందులో నానికి జంటగా సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా ఇప్పటికే ఎంపికయ్యారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్ర ఒకటి ఉందట. చిత్రకథకు ఇది కీలకమైన పాత్ర కావడంతో నారా రోహిత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం రోహిత్ ను సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు. దీని రోహిత్ ఒప్పుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.