Nara Rohit Engagement:
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నారా రోహిత్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 13న ఆయన నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ వేడుక హైదరాబాద్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనల్లుడు కావడం వల్ల ఈ వార్తపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది.
నారా రోహిత్ వివాహం జరగనుంది అనే వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన ఇంతవరకు పెళ్లి చేయకపోయాడని తెలుస్తోంది. ఆయనకు ఒక అన్నయ్య ఉన్నారు, నారా శిరీష్, అయితే ఆయన కూడా ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో, నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందనే వార్త బయటకు రావడం ఆసక్తికరంగా మారింది.
ఇక రోహిత్ నిశ్చితార్థం సంబంధించి పెళ్లి కూతురు ఎవరు అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పెళ్లి కూతురు నారా రోహిత్ తో నటించిన హీరోయిన్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ప్రతినిధి 2 సినిమాలో రోహిత్ తో కలిసి నటించిన నటి ఆయన జీవిత భాగస్వామిగా మారనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఇంకా ఈ విషయంపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారని సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ పెళ్లి కుదర్చడంలో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
ఇప్పటివరకు నారా రోహిత్ వివాహం గురించి అధికారిక సమాచారం అందలేదు కానీ, అభిమానులు, పరిశ్రమ వర్గాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి కూతురు గురించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read More: Samantha కోసం కథలు రాయడం ఆపేశాం అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్