తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య బ్రాహ్మణిపై తనకున్న ప్రేమను ట్విటర్ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ’12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 2007లో వివాహబంధంతో ఒక్కటైన వీరికి కుమారుడు దేవాన్ష్ ఉన్నాడు.
12 years.
144 months.
4,383 days.
1,05,192 hours.
63,11,520 minutes.
37,86,91,200 seconds.
Not a second out of those went by without me loving you from the bottom of my heart.
Happy Anniversary @brahmaninara!! pic.twitter.com/hD4PRpb7GX— Lokesh Nara (@naralokesh) August 26, 2019