Homeతెలుగు Newsఅవును గంటా అలిగారు.. పుకార్లపై లోకేశ్ సెల్ఫీ సెటైర్లు

అవును గంటా అలిగారు.. పుకార్లపై లోకేశ్ సెల్ఫీ సెటైర్లు

9 10మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్‌ విషయంలో అధిష్ఠానంపై అలక బూనారంటూ వస్తున్న వార్తలపై మంత్రి లోకేశ్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రి గంటాతో తాను నవ్వుతూ ఉన్న ఓ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచారు. ‘అవును నిజమే.. గంటా గారి ముఖంలో అలక చూడండి’ అంటూ సెటైర్‌ వేశారు. అందులో ఓ ఛాన్‌లోలో గంటా అలక బూనారంటూ వస్తున్న వార్త కూడా వచ్చే విధంగా ఫొటో తీసుకుని ‘అవినీతి డబ్బా.. అవినీతి పత్రిక’ అంటూ రాసుకొచ్చారు. భీమిలి నుంచి టీడీపీ తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఈ విషయంలో అలకబూనారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో లోకేశ్‌ ఈ విధంగా స్పందించారు.

అయితే, ఈసారి గంటా ఎక్కడ నుంచి పోటీచేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి గంటా బుధవారం సమావేశమయ్యారు. విశాఖలో సీట్ల వ్యవహారంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భీమిలి, విశాఖ ఉత్తరం, విశాఖ పార్లమెంట్‌ ఇలా రకరకాలపేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ భేటీలో గంటా పోటీ ఎక్కడ నుంచి అనేది స్పష్టత రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu