కాంట్రవర్సీలకు కేరాఫ్ రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీల్లో చిక్కుకునే వర్మ తాజాగా వ్యూహం సినిమాతో మరో కాంట్రవర్సీకి తెరతీశాడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రాజకీయ నేపథ్యంలో రూపొందించిన చిత్రం ‘వ్యూహం’.
ఈ చిత్రంపై టీడీపీ నాయకుడు, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యూహం సినిమాలో తన తండ్రిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వాటిని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రామ్‌గోపాల్ వర్మ తనకు ఇష్టం వచ్చినట్లు పాత్రలను సృష్టించారని, చంద్రబాబును వ్యూహం సినిమాలో తప్పుగా చూపించారని ఆరోపణలు చేశారు. చంద్రబాబును అప్రతిష్ఠపాలు చేసేందుకే వ్యూహం సినిమా తీశారని, ట్రైలర్‌లో మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 26న విచారణకు రానుంది. నారా లోకేష్ పిటిషన్‌పై ఆర్జీవీ స్పందించారు. తాను రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం సినిమాలు ఎవరినీ కించపరిచడానికి కాదని వివరణ ఇచ్చారు. ఆ సినిమాల్లో వారి పాత్రలు ఉండడంతో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. తనకు సినిమా అయినా, రాజకీయం అయినా ఒకటేనని వివరణ ఇచ్చారు.