HomeTelugu Big Storiesనాని గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

నాని గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

5 10

గతంలో ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను గ్యాంగ్‌ లీడర్‌ అందుకున్నాడా? హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించాడా..? రివ్యూ చూద్దాం

కథ : ఓ బ్యాంక్‌లో రూ. 300 కోట్ల చోరీ జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివెంజ్‌ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసి ఫేమస్ రైటర్ చలామణి అవుతుంటాడు. ఈ రియల్‌ రివెంజ్‌ స్టోరీని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఆ ప్రతీకారం వెనుక అసలు కథేంటి? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ దేవ్‌ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

5a 3

నటీనటులు: జెర్సీ వంటి విభిన్న నేపథ్యమున్న చిత్రంలో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు నాని. ఇప్పుడు పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని ఎమోషన్స్ బాగా పండించాడు. నాని ఇందులో కొత్తగా కనిపించాడు. విలన్‌గా కార్తికేయ బాగా మెప్పించాడు. రేసర్‌గా కనిపించిన తీరు, స్టైల్ బాగుంది. సినిమా అంతా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్‌, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్‌మోహన్‌ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్‌ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అనీష్‌ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అనిరుథ్ సంగీతం బాగుంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది.

విశ్లేషణ : నాని లాంటి నటుడు విక్రమ్‌ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్‌ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంతో విక్రమ్‌ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. విక్రమ్‌ సినిమా నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ సినిమాలో లేకపోవటం నిరాశకలిగించే అంశమే. ప్రథమార్థంలో కామెడీ హైలైట్. సినిమాను ఇంట్రస్టింగ్‌ సీన్‌తో ప్రారంభించిన దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికి తోడు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్‌ అయ్యింది. కామెడీ, డైలాగ్స్‌ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్‌. మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

5b

హైలైట్స్‌ : నాని నటన, సంగీతం, ఎమోషనల్ సీన్స్‌

డ్రాబ్యాక్స్ : ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగే కథనం

టైటిల్ : నాని గ్యాంగ్ లీడర్
నటీనటులు: నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్, వెన్నెల కిషోర్, లక్ష్మీ శరణ్య
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్‌, నవీన్‌
సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌

చివరిగా : మెప్పించిన నాని గ్యాంగ్
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

గతంలో ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ...నాని గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ