HomeTelugu Trendingనాని 'గ్యాంగ్‌ లీడర్‌' ట్రైలర్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ ట్రైలర్‌

1 27నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వరుస వాయిదాల తరువాత సెప్టెంబర్ 13న విడుదల కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని రివేంజ్‌ కథల రచయిత పెన్సిల్‌గా కనిపించనున్నాడు. రివేంజ్‌ రచయిత అయినా పెన్సిల్‌ ఐదుగురు ఆడవాళ్లు పగ తీర్చుకునేందుకు ఎలా సాయం చేశాడు అన్నదే గ్యాంగ్ లీడర్‌ కథ. నానికి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిచాడు. సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu