HomeTelugu Trending'ఏంటి బామ్మ ఇంత వైలెంట్‌గా లేపేశారు?'..నాని ట్వీట్‌

‘ఏంటి బామ్మ ఇంత వైలెంట్‌గా లేపేశారు?’..నాని ట్వీట్‌

6 12నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా నాని శుక్రవారం ఉదయం ‘సూపర్‌హిట్ అయితే లేపండి.. లేకపోతే డిస్ట్రబ్ చేయవద్దు’ అంటూ నటి లక్ష్మి భుజంపై తల పెట్టి నిద్రపోతున్న తన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మూవీకు మంచి స్పందన రావడంతోపాటు కొందరు సినీ ప్రముఖులు కూడా ‘గ్యాంగ్‌లీడర్’ బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని శుక్రవారం నాటి ట్వీట్‌కు కొనసాగింపుగా మరో ట్వీట్ చేశాడు. ‘ఏంటి బామ్మ ఇంత వైలెంట్‌గా లేపేశారు?’ అని నాని అడిగితే.. ‘ఒకసారి ట్వీట్స్ చూసుకో’ అని బామ్మ సమాధానం చెప్పినట్టు ట్వీట్ చేశారు. శుక్రవారంనాటి నాని ట్వీట్‌కు స్పందనగా ‘నిద్రాభంగం కలిగించే సమయం వచ్చేసింది బ్రదర్. మరో సూపర్ హిట్ వచ్చింది.. నిద్ర లేవండి’ అంటూ సంగీత దర్శకుడు అనిరుధ్ ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu