నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 26వ సినిమా ‘టక్ జగదీశ్’ సినిమా నుంచి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేసింది. చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేసింది. టక్ చేసుకుని భోజనానికి కూర్చొని.. అదే సమయంలో వెనక నుంచి కత్తి తీస్తున్నట్లు నాని లుక్ ఉంది. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ తో నిలిచిపోయిన షూటింగులు ప్రభుత్వ సడలింపులతో మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.