HomeTelugu TrendingNani: రెండు సినిమాలతో రిస్క్ చేస్తున్న నాని..

Nani: రెండు సినిమాలతో రిస్క్ చేస్తున్న నాని..

Nani
Nani to work on two projects simultaneously

Nani Hit 3: నాచురల్ స్టార్ నాని 2023లో నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. తాజాగా ఇప్పుడు నాని సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన అంటే సుందరానికి సినిమాలో నాని హీరోగా నటించారు.కానీ ఆ సినిమా అంతగా బ్లాక్ బస్టర్ అవలేదు. మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కాకుండా మరోవైపు నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశారు.

Nani Hit 3 Update:

మరోవైపు నాని స్వయంగా నిర్మిస్తున్న హిట్ ఫ్రాంచైజ్ లోని మూడవ భాగంలో తానే హీరోగా నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విషయంలో నాని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాని ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఒకేసారి మొదలు పెట్టాలని అనుకుంటున్నారట.

అయితే రెండు పడవల ప్రయాణం చేయడం అందరికీ అంత సులువైన విషయం కాదు. దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మరోవైపు అభిమానుల నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఒక సినిమాని త్వరగా పూర్తి చేసి విడుదల చేసినా ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు. కానీ రెండు సినిమాలు ఒకేసారి చేస్తే ఏదో ఒక సినిమా అయితే కచ్చితంగా లేట్ అవుతుంది.

మరి ఇన్ని సూపర్ హిట్ సినిమాలతో ముందుకెళుతున్న నాని ఇలాంటి టైంలో ఇంత రిస్క్ చేయడం అవసరమా అని ఫాన్స్ కూడా భయపడుతున్నారు. మరి నాని ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu