HomeTelugu Big Storiesనానికి ఫాదర్ ప్రమోషన్!

నానికి ఫాదర్ ప్రమోషన్!

హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నాని తన పర్సనల్ లైఫ్ లో కూడా ప్రమోషన్ అందుకోబోతున్నాడు. ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది వంటి హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకొని ఫాదర్స్ లిస్ట్ లో చేరిపోయారు.

ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నాడు. మరో కొద్ది నెలల్లోనే నాని భార్య అంజనకు బిడ్డ పుట్టబోతోంది. ఈ గుడ్ న్యూస్ తో ఇరు కుటుంబ సభ్యులు సంతోష వేడుకలు జరుపుకున్నారు.

తమ ఇంట్లోకి రాబోతున్న బుల్లి స్టార్ కు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాని ప్రస్తుతం ‘నేను లోకల్’ సినిమాలో నటుస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu