‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే
ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వేణు శ్రీరామ్ కు దిల్ రాజు అండదండలు
ఉండడంతో రవితేజ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో
రవితేజ వెనుకడుగు వేశాడు. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ డైరెక్టర్ హీరో నానికి కథ
వినిపించాడు. నాని ప్రస్తుతం ఉన్న రేంజ్ లో పెద్ద దర్శకులతో సినిమాలు చేయొచ్చు కానీ
వేణు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో
నాని మరొక ఆలోచన కూడా చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికే నాని హీరోగా నటిస్తోన్న
‘నేను లోకల్’ సినిమాను దిల్ రాజు బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఇప్పుడు వరుసగా రెండో
సారి నాని, దిల్ రాజు బ్యానర్ లో పని చేయనున్నాడు.