HomeTelugu Reviewsనాని, సుధీర్‌బాబు 'వి' సినిమా రివ్యూ

నాని, సుధీర్‌బాబు ‘వి’ సినిమా రివ్యూ

Nani Sudheer Babu V movie

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో భారీ సినిమాలకు సైతం ఓటీటీ ఒక్కటే మార్గంలా కనిపిస్తోంది. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే పలుచిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. టాలీవుడ్‌లో కాస్త హైప్ ఉన్న సినిమాగా పేరున్న ‘వి’ చిత్రాన్నిఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు. ఓర‌కంగా నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ఇలా కాస్త పేరున్న స్టార్స్ న‌టించిన చిత్రం ‘వి’ కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నాని నటించిన 25వ చిత్రం కావడం మరో విశేషం. భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదలైంది. ఇక రివ్యూ చూద్దాం.

Nani Sudheer Babu2

కథ:
అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్‌కు, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌కు మధ్య జరిగే పోరు. డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)ను కిల్లర్ (నాని) సవాలు చేస్తాడు. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ను అతని ఇంట్లోనే హత్య చేయడమే కాకుండా డీసీపీ ఆదిత్యకు ఛాలెంజ్ విసురుతాడు. క్లూస్ ఇస్తూ ఒక్కో హత్యను చేసుకుంటూ వెళ్తాడు. అసలు కిల్లర్ ఈ హత్యలు చేయడానికి కారణమేంటి? ఈ కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? చివరకు కిల్లర్‌ను ఆదిత్య పట్టుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
హీరో నాని 25వ చిత్రంగా రూపొందిన వి సినిమాలో ప్రధానంగా రెండు పాత్రలు కనిపిస్తాయి. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రాసుకున్న కథ బాగుంది. ఆ కథలో ఆయన సృష్టించిన కిల్లర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా బలంగా ఉన్నాయి. సుధీర్ పోషించిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు ఛాలెంజ్ విసిరే తెలివైన కిల్ల‌ర్ పాత్ర నానిది‌. అస‌లు ఈ హ‌త్య‌లకు కార‌ణ‌మేంట‌నే విష‌యాన్ని ముందుగానే ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా సినిమా ముగియ‌డానికి అర్థగంట ముందు రివీల్ అయ్యేలా ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ క‌థ‌ను ముందుకు నడిపారు. ఇది సీరియస్‌గా సాగే మైండ్ గేమ్ కాబట్టి కామెడీని చొప్పించే ప్రయత్నం అయితే దర్శకుడు చేయలేదు. కాకపోతే, నాని పాత్రతోనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. నాని సీరియస్‌గా ఉంటూనే తన మేనరిజంతో అక్కడక్కడ కాస్త నవ్వించారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ప్రస్తావించిన విధానం బాగుంది. ఇలాంటివి రెండు మూడు సన్నివేశాలు ఉన్నాయి. ఇది క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి హత్యలు చేసే సన్నివేశాలు చాలా క్రూరంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే మర్డర్ సీన్ వణుకు పుట్టిస్తుంది.

నటీనటులు:
సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్ న‌ట‌న చాలా బావుంది. లుక్ ప‌రంగా సుధీర్ పడ్డ క‌ష్టాన్ని డైరెక్ట‌ర్ తొలి ఫైట్‌తో తెర‌పై ఆవిష్క‌రించాడు. నాని పాత్ర గురించి చెప్పాలంటే ‘వి’ నాని 25వ సినిమా. నెగెటివ్ షేడ్ అనేలా సాగే పాజిటివ్ పాత్ర. కిల్లర్‌గా నాని తన నటనలో కొత్తదనం చూపించాడు. సుధీర్ ల‌వ‌ర్‌గా, నవలా రచయితగా న‌టించిన నివేదా థామ‌స్ న‌ట‌న పరంగా పాత్ర‌లో ఇమిడిపోయే ప్ర‌య‌త్నం చేసింది. సాహెబా పాత్రలో అదితిరావు హైదరి మెప్పించింది. రోహిణి, వెన్నెల కిషోర్‌, హ‌రీశ్ ఉత్త‌మున్ త‌దిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టైటిల్: ‘వి’
న‌టీన‌టులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి, త‌దితరులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీశ్, హ‌ర్షిత్ రెడ్డి
సంగీతం: అమిత్ త్రివేది
విడుద‌ల‌: అమెజాన్ ప్రైమ్‌

హైలైట్స్:
నాని, సుధీర్ పాత్రలు
ఫస్టాఫ్ కథనం
నాని సెంటిమెంట్

డ్రాబ్యాక్స్
క్లైమాక్స్

చివరిగా: అంచనాలను అందుకోలేకపోయిన ‘వి’చిత్రం
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu