నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలతో బీజీగా ఉన్నాడు. త్వరలో టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ‘టాక్సీవాలా’ డైరక్టర్ రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. ఫాంటసీ మిక్స్ అయి ఎమోషనల్ గా ఉండే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకోసం హైదరాబాద్ లో భారీ సెట్ ను వేయబోతున్నారట. కథ ప్రకారం కలకత్తా లో జరిగే సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉంది. అది కూడా 20 ఏళ్ల క్రితం కలకత్తా పరిసరాల్లో జరగాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి షూట్ చేయడం కుదరనిపని దాంతో కలకత్తా పరిసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేయబోతున్నారట. కలకత్తా కాళీ టెంపుల్ సెట్ కూడా వేయనున్నారట. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.