టాలీవుడ్‌లో ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌చూపిస్తుండటంతో విక్రమ్ మరో హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు.
డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేచురల్ స్టార్ నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.