టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఉగాదికి వైలెన్స్ చూపిస్తానంటున్నారు. సుధీర్‌బాబు, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం నాని, సుధీర్‌బాబు మొదటిసారి కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. నివేదా థామస్, ఆదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
“ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు – విలియమ్ షేక్స్పియర్.’ నా శత్రువులందరూ.. జాగ్రత్తగా ఉండండి’ వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు’ అని చిత్రబృందం పేర్కొంది.
ఈ పోస్టర్‌పై స్పందించిన నాని ‘వైలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్‌గా ఇస్తా..’ అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Violence kavalannaru ga 🙂
Istha…
UGADI ki SOLID ga istha …🔥#VTheMovie ✌🏼@mokris_1772 @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @ItsAmitTrivedi @SVC_official pic.twitter.com/Rc4KKAWhVD— Nani (@NameisNani) November 4, 2019