నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్న ఈ సినిమాకి ‘వి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, ఇంతవరకూ ఆయన ఈ తరహా పాత్రను చేయలేదని అంటున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, నాని తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఆయన తదుపరి సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనుంది. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ కథ గోదావరి నేపథ్యంలో నడుస్తుందనేది తాజా సమాచారం. గోదావరి యాసలోనే నాని మాట్లాడతాడని అంటున్నారు. లవ్ ను .. ఎమోషన్ ను కలిపి అందించడంలో తను సిద్ధహస్తుడననే విషయాన్ని శివ నిర్వాణ ఆల్రెడీ నిరూపించుకున్నాడు. అందువలన ఈ ప్రాజెక్టుపై అంతా ఆసక్తితో వున్నారు.