
‘అంటే.. సుందరానికీ!’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్ననేచురల్ స్టార్ నాని తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. గతేడాది దసరా సినిమాని ప్రకటించిన నాని తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు. చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకుడు సుకుమార్, కిశోర్ తిరుమలు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరినా ముఖ్య పాత్రలు పోషించనున్నారు.













