HomeTelugu TrendingNani Hit 3: సైకో లా మారబోతున్న భల్లాలదేవుడు

Nani Hit 3: సైకో లా మారబోతున్న భల్లాలదేవుడు

Nani Hit 3
Nani Hit 3 to feature a star hero

Nani Hit 3:

టాలీవుడ్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఇండస్ట్రీ లో రాణిస్తున్నాడు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు నాని హిట్ 3 సినిమాలో కూడా నటించనున్నారు శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

హిట్ ఫ్రాంచైజ్ లో మొదటి రెండు భాగాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు, హీరోగా నాని స్వయంగా నటించనున్నారు. నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో చేయాల్సిన సినిమావాయిదా పడటం వల్ల, నాని ముందుగా హిట్ 3 ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెయిన్ విలన్ గా రానా దగ్గుబాటి నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్, ఇందులో హీరో అంటే నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హిట్ 2 లో సుహాస్ విలన్ గా కనిపించారు. ఇక హిట్ త్రీ సినిమాలో రానా సైకో కిల్లర్ లాగా కనిపించనున్నారు అని సమాచారం.

Nani Hit 3:

హిట్ మూడవ భాగం కోసం నాని సినిమా రేంజ్ ఇంకా పెంచాలని నిర్ణయించుకున్నారు. అందుకే స్టార్ హీరో రానాను సంప్రదించారు అని సమాచారం. రానా, నాని ఎప్పటినుంచో చాలా మంచి స్నేహితులు కావడంతో నాని ఈ పాత్ర కోసం రానా ను కోరగా రానా కూడా వెంటనే ఒప్పుకున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది.

మరోవైపు, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ లో వెంకటేష్ హీరోగా నటించారు. ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాబట్టి ఈ సారి శైలేష్ పై మరింత ఒత్తిడి ఉంది అని చెప్పుకోవచ్చు. హిట్ ఫ్రాంచైజ్‌ను నాని నిర్మిస్తున్నారు. ఈ సారి రానా ఎంట్రీ తో సినిమా పై అంచనాలు మాత్రమే కాక బడ్జెట్ కూడా డబుల్ అవుతున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu