
Nani Hit 3 story:
నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రల్లో కనిపించాడు. కానీ ఇప్పుడు ‘హిట్ 3’ కోసం పూర్తి వైలెంట్ అవతారం ఎత్తాడు. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ‘హిట్’ సిరీస్‌లో ఇది మూడో భాగం. అయితే, మునుపటి రెండు సినిమాలు నేర విచారణపై ఎక్కువ దృష్టి పెట్టగా, ఈ సారి మాత్రం ఎలా క్రైమ్ చేసారన్నదానిపై ఫోకస్ పెట్టారట.
ఇటీవల నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “నా కెరీర్‌లోనే అత్యంత ఊరమాస్ సినిమా ఇదే. ఇందులో ఉండే వైలెంట్ యాక్షన్ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిందే” అని అన్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
‘హిట్’ ఫ్రాంచైజ్ మొదటి రెండు సినిమాలు సక్సెస్ కావడంతో, మూడో భాగాన్ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, అడివి శేష్ లాంటి టాలెంటెడ్ హీరోల తర్వాత నాని స్వయంగా ఈ యూనివర్స్‌లోకి ఎంటరవ్వడం ప్రత్యేక ఆకర్షణ.
ఈ సారి కథలో ప్రధాన మార్పు ఏమిటంటే – ‘హిట్ 1, హిట్ 2’లో నేరం ఎవరు చేశారన్నది ప్రధాన పాయింట్‌గా ఉండేది. కానీ ‘హిట్ 3’లో నేరం ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న మైండ్ గేమ్ ఏమిటన్నదే కీలకం. అంటే, ఈ సారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయన్న మాట.
అర్జున్ సర్కార్ పాత్రలో నాని చాలా స్టైలిష్, ఇంకా రగ్డీ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో అలరించిన నాని, ఈసారి మాస్ యాక్షన్ అవతారంతో అదరగొట్టనున్నాడు. ‘హిట్ 3’కు ప్రేక్షకుల హైప్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది. మే 1న విడుదలయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి!