HomeTelugu TrendingNani ని కలవాలి అంటే ఇలాగే వెళ్ళాలట!

Nani ని కలవాలి అంటే ఇలాగే వెళ్ళాలట!

Nani calls his fans to meet him
Nani calls his fans to meet him

Nani in Saripodhaa Sanivaaram Press meet:

నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రెయిలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ట్రెయిలర్ లో నాని ఎక్కువగా ఎరుపు స్కార్ఫ్ ధరించినట్లు కనిపిస్తాడు. ఈ స్కార్ఫ్‌కు సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని తెలుస్తోంది.

నాని నటిస్తున్న సూర్య పాత్రలో విలన్ సీఐ దయాకర్ రావు (ఎస్జే సూర్య)తో ఎదురు తిరిగినప్పుడు నాని స్కార్ఫ్ తో తన ముఖాన్ని కప్పు ఆ ఈ స్కార్ఫ్‌ను ఉపయోగిస్తాడు. తాజాగా నాని సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చెన్నై, కొచ్చి లో తన చిత్ర ప్రోమోషన్లను పూర్తి చేసిన నాని తాజాగా హైదరాబాద్ లోని ప్రోమోషన్ లను మొదలుపెట్టారు. హైదరాబాద్ లో సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా నాని తన చేతికి ఎరుపు స్కార్ఫ్ ధరించాడు.

ఈ సందర్భంలో తన అభిమానులతో మాట్లాడిన నాని, “నేను దిల్ రాజు గారిని మొదటి షో ఏ థియేటర్ లో వేస్తామని అడిగాను. ఆయన సుదర్శన్ (ఆర్ టి సి క్రాస్ రోడ్స్) లో వేస్తామన్నారు. కాబట్టి ఆగస్టు 29న ఉదయం 11 గంటలకు మీ అందరినీ సుదర్శన్ లో కలుస్తాను. కానీ మీరు కూడా చేతికి రెడ్ స్కార్ఫ్ ని కట్టుకుని రావాలి,” అని కండిషన్ పెట్టారు నాని.

ఈ నేపథ్యంలో సినిమా చూడటానికి మాత్రమే కాక.. నాని ని కలవడానికి కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక ఆరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu