Nani – Samantha:
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నాని బాగా బిజీగా ఉన్న హీరో అని చెప్పవచ్చు. నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా ప్రాంతాల్లో కూడా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైకి వెళుతున్న నానికి ఒక స్టార్ హీరోయిన్ కనిపించారు.
ఆమె మరెవరో కాదు సమంత. నాని, సమంతాల కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్దరూ హీరో హీరోయిన్లుగా రెండు సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ. మరొకటి మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన ఏటో వెళ్లిపోయింది మనసు.
ఈ రెండు సినిమాలలోనూ వీళ్లిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. తాజాగా ఇప్పుడు నాని తన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరగా ఫ్లైట్ ఎక్కే సమయంలో సమంత ఎదురుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో నాని సమంత నవ్వుతూ.. కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. నాన్న నాన్న కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాని డీవివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరోవైపు సమంత బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన సిటాడల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కి సిద్ధం అవుతోంది.