HomeTelugu Trending‘అంటే సుందరానికీ’ నుంచి ట్రైలర్ అప్డేట్..

‘అంటే సుందరానికీ’ నుంచి ట్రైలర్ అప్డేట్..

Ante Sundariniki Teaser Lives Up To Its Hype Created

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కు బిగ్ అనౌన్స్ మెంట్ అందింది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో బిగ్ సక్సెస్  ను అందుకున్న నాని తాజాగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. సినిమాపై ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టిన చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది.  మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు మూవీ ట్రైలర్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా మేకర్స్‌ ప్రకటించారు.కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అంటే సుందరానికీ’లో నాని సుందర ప్రసాద్ పాత్రను పోషిస్తుండగా.. హీరోయిన్ నజ్రియా లీలా పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu