నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. చాలా రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి ప్రీ లుక్ పోస్టర్‌ను నాని శనివారం విడుదల చేశారు. ప్రీలుక్‌ను షేర్ చేస్తూ.. ‘మేం కలిశాం.. సిద్ధంగా ఉన్నాం.. మాది ఓ గ్యాంగ్.. ‘గ్యాంగ్‌లీడర్’ని నేనే’ అంటూ నాని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో నానితో ఐదుగురు చేతులు కలిపినట్లు చూపించారు. ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జులై 15న, మొదటి పాటను జులై 18న, టీజర్‌ను జులై 24న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది. మరోపక్క ఆయన హీరోగా ‘వి’ చిత్రం తెరకెక్కుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్‌బాబు మరో హీరోగా కనిపించనున్నారు. నివేధా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.
We MET
We are READY
We are the GANG
&
I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7— Nani (@NameisNani) July 13, 2019